Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:25 AM

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

29-12-2025 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాచకొండలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్

303 మందిపై కేసులు నమోదు

స్థానికం ప్రతినిధి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22.12.2025 నుంచి 28.12.2025 వరకు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 303 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 11 ఆటో డ్రైవర్లు, 50 కార్ల డ్రైవర్లు ఉన్నారు.

బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా పరిశీలిస్తే,

278 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య,

19 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య,

6 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు ఆల్కహాల్ సేవించినట్లు తేలింది.

వీరందరినీ చట్టప్రకారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత వారంలో నమోదైన 68 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించగా, అందులోని 68 మందికి రూ.2,07,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించారు.

Sthanikam

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News