Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:24 AM

పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

15-05-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఐదో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, పుస్తకాల పంపిణీ, పుస్తక సమీక్ష, ఉత్తమ పాఠకులకు బహుమతుల ప్రదానం కార్యక్రమాలు చేపట్టారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలోని పుస్తకాలను కూడా అధ్యయనం చేసినప్పుడే విస్తృతమైన విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. తలదించుకొని చదివినప్పుడే తలెత్తుకొని జీవించే స్థాయికి పుస్తకాలు తీసుకెళ్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమ ఇన్‌చార్జి డాక్టర్ రాచమళ్ల శ్రీను మాట్లాడుతూ.. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు సంబంధించిన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య.. తండు సాయన్నదాసు రచించిన ‘సాయన తత్వాలు’ పుస్తకాన్ని సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News