Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?
15-02-2026 556 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

20 వార్డులు ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. ఆ కిరీటం ఎవరిని వరించబోతుంది అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఈసారి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఆ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోటీ పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన 9వ వార్డు అభ్యర్థి మోగుదాల పావని, 13వ వార్డు అభ్యర్థి బత్తుల వాణి, 7వ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల పేర్లు చైర్మన్ రేస్ లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు తమ వర్గాల మద్దతుతో చైర్మన్ రేసు లో ముందు ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఇప్పటికే అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పట్టణ రాజకీయాల్లో వాడి.. వేడి చర్చలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి దక్కుతాయన్నది కీలకంగా మారింది. ఎమ్మెల్యే సూచనలే తుది నిర్ణయానికి మార్గం చూపుతాయని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.

ఒక్కొక్కరిది ఒక్కో బలం

చౌటుప్పల్ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు కేటాయించడంతో సామాజిక సమీకరణాలు, రాజకీయ సమతుల్యత, పార్టీ నాయకత్వ సలహాతో చైర్మన్ పీఠం ఎవరికి ఇవ్వాలనేది తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో జరిగే ఎన్నికలో చౌటుప్పల్ పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ పీఠం చివరికి ఎవరి తలపై కిరీటంగా మెరవబోతుందో చూడాలని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Sthanikam

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News