Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

10-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులు మరియు అధికారులను ఆదేశించారు.శుక్రవారం బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి,వాటిలో ఎన్ని వివిధ దశల్లో ఉన్నాయనే వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నదని పేర్కొంటూ,రెండో విడతలో కూడా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తే,తదుపరి దశలో గ్రామానికి మరిన్ని ఇండ్లు మంజూరు అయ్యే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News