Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:37 AM

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

12-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజల సమస్యలకు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా ఎస్పీ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను శ్రద్ధగా విని, సంబంధిత కేసులకు సంబంధించిన వివరాలను ఆయా పోలీస్ స్టేషన్‌ల ఎస్‌.హెచ్‌.ఓలతో ఫోన్ ద్వారా సంప్రదించి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై ఎలాంటి పక్షపాతం లేకుండా, పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు పూర్తి న్యాయం చేకూర్చాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అలాగే ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, కేసుల పురోగతిపై నిరంతరంగా సమీక్ష నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పోలీస్ శాఖ పని చేయాలని, ప్రతి ఫిర్యాదుకు సమయపాలనతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం కాని సమస్యలపై ఎలాంటి భయాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటికీ ప్రాధాన్యత ఇస్తూ, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామని తెలిపారు.

Sthanikam

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News