చిట్యాల స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి.
ప్రజాస్వామ్యంలో వార్తాపత్రికలే కీలకమని చిట్యాల ఎస్సై రవికుమార్ అన్నారు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వారధిలా ఉన్న అక్షర కలం దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఎస్సై రవికుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ స్తంభంగా ఉండి ప్రజలు చైతన్య పరచటంలో వార్త దినపత్రికలు చాలా ముఖ్యమని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు ప్రస్తుతం ఉన్న వార్తాపత్రికలు వారిలా ఉండాలని, ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పత్రికలు కీలక పాత్ర పోషించాలన్నారు. పత్రికలు సమాజానికి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో పత్రికల పాత్ర చాలా కీలకమని, పత్రికలు నిస్వార్ధంగా నిబద్ధతతో వార్త, కథనాలు రాయాలని, నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలని, అక్షర కలం పత్రిక పేరు ప్రఖ్యాతలు ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అక్షర కలం నకిరేకల్ నియోజకవర్గ రిపోర్టర్ కూనూరు మధు పోలీసు సిబ్బంద , ప్రజా నాయకులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి