Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:41 PM

ప్రజల సేవకే జీవితం అంకితం చేసిన మహానీయుడు ఉప్పల మల్సూర్

13-01-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్

సూర్యాపేట టౌన్, జనవరి :

ప్రజా ప్రతినిధిగా ప్రజల సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ అని సూర్యాపేట పూర్వ విద్యార్థుల మిత్రమండలి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, అధ్యక్షుడు నల్లకుంట్ల అయోధ్య అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ 27వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… సూర్యాపేట నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై, ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యంగా నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు.

నేటి సమాజంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కోట్లు సంపాదించే పరిస్థితులు ఉన్నప్పటికీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా కనీసం స్వంత ఇల్లు లేకుండా జీవితం సాగిస్తూ ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన వ్యక్తి ఉప్పల మల్సూర్ అని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద ఉప్పల మల్సూర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. బిన్ రెడ్డి, ధర్మబిక్షం, మల్లు స్వరాజ్యం, ఉప్పల మల్సూర్, నర్రా రాఘవరెడ్డి వంటి మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి ప్రధాన కార్యదర్శి బయ్య మల్లికార్జున్, డేగల జనార్ధన్, నాతి సవేందర్, జిలకర చంద్రమౌళి, విద్యాసాగర్, సారగండ్ల మాణిక్యమ్మ, చిత్రం భద్రమ్మ, వీర్లపాటి వెంకన్న, షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజల సేవకే జీవితం అంకితం చేసిన మహానీయుడు ఉప్పల మల్సూర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News