Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:45 AM

ప్రజా వ్యతిరేక బిల్లులను ఉపసంహారించుకోకుంటే బీ జే పీ పఠనం తప్పదు

ప్రజా వ్యతిరేక బిల్లులను ఉపసంహారించుకోకుంటే బీ జే పీ పఠనం తప్పదు

ప్రజా వ్యతిరేక బిల్లులను ఉపసంహారించుకోకుంటే బీ జే పీ పఠనం తప్పదు
January 13, 2026 08:43 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆర్.జనార్ధన్, ఐఒఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ప్రజలు,రైతు.కూలీలు తిరగబడే స్థితి తెచ్చుకోవద్దు

కల్లెపు అడివయ్య ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు

స్థానికం:ఆలేరు ప్రతినిధి శ్రీనివాస్

2025 సంవత్సరం చివరలో పార్లమెంట్ లో ఎలాంటి చర్చలు లేకుండానే ఏకపక్షంగా,కుట్రపూరితంగా ఆమోదించుకున్న నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు, విత్తన బిల్లు,విద్యుత్ సవరణ(ముసాయిదా)బిల్లు,వికసిత్ భారత్ జీ రామ్ జీ బిల్లులను తక్షణమే ఉపసంహారించుకోవాలని లేనట్లయితే ప్రజలు,రైతు.కూలీలు తిరగబడక తప్పదని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.జనార్ధన్, ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు కల్లేపు అడివయ్య లు స్పష్టం చేశారు.మంగళవారం నాడు మోట కొండూరు మండలంలోని ఇక్కుర్తి,ఆలేరు మండలంలోని మందనపల్లి,టంగుటూరు, ఆలేరు, మోట కొండూరు మండలంలోని ఇక్కుర్తి లో విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, ఉపాధి హామీ పథకం బిల్లును నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ ల బిల్లు 2025 ను బేశరత్ గా వెనక్కి తీసుకోవాలని కేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏ ఐ కె ఎం ఎస్, ఐ ఎఫ్ టి యు ల ఆధ్వర్యంలో మోడీ ప్రజా వ్యతిరేక బిల్లుల ప్రతులను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జనార్ధన్,అడివయ్య మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం తెచ్చిన వీ బీ జీ రామ్ జీ చట్టం పనిహక్కును రద్దుచేసి మరొక సంక్షేమ పథకంగా మార్చి వేసిందని విమర్శించారు.దీని అమలు బడ్జెట్ కేటాయింపులపై అనగా కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు.అంతేకాక వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే 60 రోజులు ఈ చట్టం కింద పనులను నిషేధిస్తుందని గతంలో ఏడు గంటలను పని దినంగా గుర్తించగా ఇప్పుడు దానిని ఎనిమిది గంటలకు పెంచాలని అవసరమని భావించినప్పుడు దానిని 12 గంటల వరకు కూడా పొడిగించవచ్చునని అన్నారు. గతంలో మెటీరియల్, యంత్రాల వినియోగం కనిష్ట స్థాయిలో ఉండగా ఇప్పుడు దానిని జిల్లా స్థాయిలో 40 శాతానికి పెంచాలని ఆధునిక యాజమాన్య పద్ధతుల పేరిట, బయోమెట్రిక్, మొబైల్ లేదా డ్రోన్ల ద్వారా ఫోటోలు, పర్యవేక్షణ పెట్టారని బడ్జెట్ కేటాయింపులను బట్టి పనుల కల్పన ఉంటుంది తప్ప అవసరాన్ని బట్టి పనుల కేటాయింపు జరగదని స్పష్టం చేశారు.గ్రామీణాభివృద్ధి ఉపాధి కల్పన ప్రధానంగా రాష్ట్రాల పరిధిలోనిదని, జీ రాం జీ చట్టం ద్వారా రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తుందని, ఉపాధి కల్పించే గ్రామాలు, పనుల నిర్ణయం రాష్ట్రం, గ్రామాల నుండి కేంద్రం చేతుల్లోకి పోయిందని, రాష్ట్రాలు, గ్రామ పంచాయతీల పని ప్రతిపాదన వరకే పరిమితం అవుతుందని,ఈ పథకం కింద అయ్యే ఖర్చులో కేంద్రం వాటా 60 శాతానికి తగ్గించి, రాష్ట్రం వాటా 40 శాతానికి పెంచదంలోనే ఉపాధి హామీ పథకం భవిష్యత్తులో రద్దు అవుతుందని చాలా స్పష్టంగా అర్థం అవుతుందని అన్నారు. కావున ఈ కొత్త పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (చట్టం)పథకాన్ని కొనసాగించాలని పెద్ద ఎత్తున ప్రజలు, రైతు కూలీలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఇక్కిరి సహదేవ్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్,సిరిమర్తి నర్సయ్య, మందనపల్లి ఉప సర్పంచ్ పద్మ శశిరేఖ,ప్రజా సంఘాల నాయకులు చిర బోయిన కొమురయ్య, సాదుల శ్రీకాంత్,మాణిక్యం, దడిగే రాములు, అయిల యాకయ్య,కుర్రి మార్కండేయ,చింతకింది సత్యనారాయణ,చిర బోయిన రాజయ్య, నమిలే స్వామి, మారుజోడు కుమార్,వడ్డేపల్లి భూపాల్,గాజుల వెంకటేష్,ఇరుగదిండ్ల వెంకటేష్,బుడిగే లక్ష్మయ్య, గాజుల సంతోష్, కడకంచి సిద్దులు, కర్రెస్వామి,యెలగందుల సిద్దులు,ఉట్కూరి సురేష్,ఆర్.ఉదయ్,కడకంచి బీరయ్య,పిల్లలమర్రి లాలయ్య,నోముల రవి, కుర్రి సాయి,కడకంచి రమేష్, అయిల శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News