Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

ప్రజా పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతాయి

12-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ప్రజల కోసం పోరాడేది కమ్యూనిస్టులే

-సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలే మార్గమని పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ అన్నారు.ప్రజల హక్కుల కోసం,వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది మార్సిస్టులేనని వారు తెలియజేశారు.ఆదివారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ జనరల్ బాడీ సమావేశం(పిక్నిక్)శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్ అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ఎండీ.జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ...ప్రపంచమంతా శాస్త్రీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే మన దేశంలో మాత్రం మూఢాచారాలకు కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విమర్శించారు.సమాజంలో సామాజిక అసమానతలు,మహిళలపై దాడులు రోజురోజు పెరుగుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు.సోషలిస్టు దేశాల్లో ఎర్ర జెండా పాలనలో ఆకలి,దారిద్ర్యం,దోపిడి,అణిచివేత లేకుండా ప్రజలందరికీ విద్యా,ఉద్యోగం ఉపాధి అందించడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.బిజెపి పాలనలో మాత్రం కులాల,మతాల పేరిట విద్వేషాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు.విద్యా,వైద్యం సామాన్య ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలిపోయాయని అన్నారు.కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లు గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చేయాలన్నా,గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తగిన నిధులు కేటాయించాలని జహంగీర్ సూచించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ,జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ,మండల కార్యదర్శి,చీమలకొండూరు సర్పంచ్ పల్లెర్ల అంజయ్య,మండల కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి మల్లేష్,కొండమడుగు నాగమణి,సిపిఎం సీనియర్ నాయకులు గునుగుంట్ల శ్రీనివాస్,మాజీ సర్పంచులు బొల్లెపల్లి కుమార్,గునుగుంట్ల కల్పన,ఏదునూరి ప్రేమలత,గ్రామ సర్పంచ్ రాయపురం సురేష్,సిపిఎం మండల కమిటీ సభ్యులు అబ్దుల్లాపురం వెంకటేష్,బొల్లపల్లి లీల,గ్రామ నాయకులు ఎండి.జహంగీర్,కడారి కృష్ణ,స్వామి,మల్లేష్,కిషన్,పాండు,బాల మల్లేష్,బాలరాజు,కళ్యాణి,జ్యోతి,హేమలత,కావ్య,ప్రీతి,నజీమా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతాయి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News