Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:36 PM

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్

25-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పూర్తి స్థాయి వసతి సౌకర్యాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వసతి గృహాల్లోని మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, పరిశుభ్రత, భద్రత, భోజన నాణ్యత అన్నీ మెరుగ్గా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూములు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి పౌష్టికాహారం అందుతున్నదీ, పర్యవేక్షణ సక్రమంగా జరుగుతున్నదీ పరిశీలించారు. అదేవిధంగా పోక్సో కేసులు, మానవ అక్రమ రవాణా నివారణ, నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో, భూ నిర్వహణ చట్టాల అమలు, మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. విద్యార్థులకు మెరుగైన వసతి, భద్రత, పోషకాహారం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి, ఆర్.డి.ఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News