Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:14 PM

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై కలెక్టర్ నేర పరిశీలన ఆలేరు–యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో తనిఖీలు.

09-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సోమవారం ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు.

పోస్టల్ బ్యాలెట్ వినియోగించిన ఉద్యోగుల సంఖ్యపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాల పంపిణీ సక్రమంగా జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, వసతులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సోమవారం సాయంత్రం నాటికి పూర్తవుతుందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం సేకరించిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై కలెక్టర్ నేర పరిశీలన ఆలేరు–యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో తనిఖీలు.

Article Image

సోమవారం ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు.

పోస్టల్ బ్యాలెట్ వినియోగించిన ఉద్యోగుల సంఖ్యపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాల పంపిణీ సక్రమంగా జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, వసతులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సోమవారం సాయంత్రం నాటికి పూర్తవుతుందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం సేకరించిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News