Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి

11-02-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది పూర్తి అప్రమత్తతో పనిచేయాలని చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం చౌటుప్పల్ పట్టణంలోని సాన్ జాన్ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలీస్ అధికారుల, సిబ్బంది సమావేశంలో ఏసీపీ పాల్గొని మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యవస్థ పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఏసీపీ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేలా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేపడుతుందన్నారు.పోలింగ్ కు ముందు, పోలింగ్ రోజున సున్నిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అనుమానాస్పద వ్యక్తులు, గుంపులపై కఠిన నిఘా పెట్టాలని, అక్రమ మద్యం, నగదు, ఇతర ప్రలోభాలకు సంబంధించిన చర్యలను అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.ప్రజలతోమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారిలో విశ్వాసం కలిగించే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఆలస్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఏసీపీ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు. సమావేశంలో సిఐ మన్మధ కుమార్, ట్రాఫిక్ సీఐ విజయ్ మోహన్, ఎస్ఐ యాదగిరి, ఎస్సై అజయ్ భార్గవ్, ఎస్పై ఉపేందర్ రెడ్డి, ఎఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News