Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:42 AM

పంతంగిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను మార్చాలని అధికారులకు వినతి

21-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో వ్యవసాయ విద్యుత్ లైన్లు ప్రజల నివాసాల మధ్యగా, ఇళ్ల పక్కల నుంచి వెళ్లడం వల్ల తీవ్ర ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయని గ్రామ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు తగిన రక్షణ లేకుండా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పంతంగి గ్రామ ఉపసర్పంచ్ బోయ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, గ్రామ నాయకులు బోయ కిరణ్, అంతటి నరేష్ తదితరులు చౌటుప్పల్ ఏడి, ఏఈ అధికారులకు వినతి పత్రం అందజేశారు.గ్రామంలో అవసరమైన చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, శిధిలావస్థలో ఉన్న స్తంభాలను వెంటనే తొలగించాలని, ఇళ్ల మధ్యగా వెళ్లే వ్యవసాయ విద్యుత్ వైర్లను సరిచేసి సురక్షితంగా మార్చాలని వారు కోరారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో చిన్నపిల్లలు, వృద్ధులు నివసిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అపశృతి జరగకుండా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు కోరారు. అధికారుల స్పందనపై గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

పంతంగిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను మార్చాలని అధికారులకు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News