Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:27 AM

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు

05-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో జీపీఓబీడీ టీం లీడర్,తహశీల్దార్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల వారీగా ఇంటి పన్నుల వసూళ్ల పురోగతిపై సమీక్ష చేపట్టారు.ఇంటి పన్నులు,ఇతర స్థానిక పన్నుల వసూళ్లను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని అధికారులకు సూచించారు.పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో చేర్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని,ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు.ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Sthanikam

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News