Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి

07-04-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రీజినల్ మేనేజర్‌కు గ్రామ ప్రజల విజ్ఞప్తి

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునఃప్రారంభించాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు.గ్రామ ప్రతినిధులు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా దిల్‌సుఖ్‌నగర్ నుండి పంతంగి గ్రామానికి నడిచే 555 నంబర్ బస్సు సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ బస్సు ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేవారని తెలిపారు.

అయితే ఇటీవల ఈ బస్సు సేవలను నిలిపివేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం 555 బస్సు సర్వీసును వెంటనే పునఃప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి, గుండెపురం ప్రతిభ నరేష్, గాడిదల శ్వేత ప్రవీణ్, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, బాతరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News