Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:10 PM

పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పశువుల అక్రమ రవాణా పట్టివేత

12-05-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 23 పశువులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. తేదీ 11-05-2026న ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఏ. నరేష్ (HC 2314), ఏఆర్‌పీసీ 7967 సీతారాం రెడ్డి పెట్రోమొబైల్-01లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు 06-05-2026న ఉదయం 4.30 గంటల సమయంలో పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పీసీ 4618 శ్రీనుతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో భాగంగా TS12UD 6308 నంబర్ గల డీసీఎం వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 10 ఆవులు, 4 ఎద్దులు, 4 మగ దూడలు, 5 ఆడ దూడలు మొత్తం 23 పశువులు ఉన్నట్లు గుర్తించారు.వాహన డ్రైవర్‌ను విచారించగా అతను రమావత్ శరత్‌కుమార్ (25), తండ్రి మృతుడు శంకర్, చెన్నారెడ్డిగూడెం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా వాసి అని తెలిపాడు. దాసరి వీరబాబు ఆదేశాల మేరకు జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించాడు. డీసీఎం వాహన యజమాని పత్లావత్ రాజు, తండ్రి సుకియా, నాంపల్లి, హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ్ కుమార్ తెలిపారు.

Sthanikam

పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పశువుల అక్రమ రవాణా పట్టివేత

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News