Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:33 PM

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

26-03-2026 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తేది: 25.03.2026: నారాయణఖేడ్ పరిధిలోని పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడిగి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, అతను డ్రైవర్‌గా మేడ్చల్ ప్రాంతంలో చాకలి రమేశ్‌తో కలిసి పనిచేస్తుండగా పని మానేస్తానని చెప్పిన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం సుధాకర్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రమేశ్ 25వ తేదీ సాయంత్రం సుమారు 7.15 గంటల సమయంలో సుధాకర్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడి బెదిరించాడు. కొద్దిసేపటికే హస్నాబాద్ అంజి, చాకలి అంజి, బూతుపల్లి యాదగిరి, చాకలి రమేశ్ నలుగురు కలిసి రెండు బైకులపై సుధాకర్ ఇంటి వద్దకు చేరుకుని కులపేరుతో దూషిస్తూ గొడవకు దిగారు. ఈ సమయంలో సుధాకర్‌పై దాడి జరుగుతుండగా అడ్డుకోవడానికి వచ్చిన అతని అన్న మామిడిగి శ్రీనివాస్‌పై అంజి బ్లేడు‌తో గొంతు కోయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు వెంటనే గొడవను ఆపగా గాయపడిన శ్రీనివాస్‌ను జాహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు జాహీరాబాద్ డీఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

Sthanikam

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News