Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 02:38 AM

పిల్లల రక్షణకు పోక్సో చట్టం – విద్యార్థుల్లో చైతన్యం

08-04-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాది ఎం.ఎన్.ఆర్ ఉన్నత పాఠశాలలో భరోసా కోఆర్డినేటర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు,పిల్లలపై జరిగే లైంగిక దాడుల కేసుల్లో విధించే కఠిన శిక్షలు వంటి అంశాలను వివరంగా తెలియజేశారు.అలాగే భరోసా కేంద్రం పోక్సో కేసుల్లో ఎలా సహాయం చేస్తుందో, బాధితులకు అందించే సేవలు ఏమిటో స్పష్టంగా అవగాహన కల్పించారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే తమ లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించేందుకు క్రమబద్ధమైన రోజువారీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. యవ్వన దశలో ఎదురయ్యే ఆకర్షణలు, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావాలు, విద్య ప్రాముఖ్యత వంటి కీలక అంశాలపై కూడా విద్యార్థులతో చర్చించి, వారికి సరైన దారినీ చూపించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మారియా నాతన్, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పిల్లల రక్షణకు పోక్సో చట్టం – విద్యార్థుల్లో చైతన్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News