Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:24 AM

పిల్లల ప్రతిభ వికాసమే లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

14-05-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా బాలసదనంలో పిల్లల కోసం వేసవి శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి లలిత కుమారి మాట్లాడుతూ వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకొని తమలోని సృజనాత్మకతను వెలికి తీయాలని సూచించారు. చిత్రలేఖనం, రంగుల అలంకరణ, నృత్యం, గానం, లోపలి ఆటలు, బయటి ఆటల ద్వారా ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. చదువుతో పాటు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి చదవాలని సూచించారు. ఉన్నతాధికారులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిల్లలకు ప్రేరణనిచ్చారు.సిడబ్ల్యూసీ సభ్యుడు వెంకటేశం మాట్లాడుతూ... పిల్లలు చెడు ఆకర్షణలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి పెట్టాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేయాలని తెలిపారు. డిసిపిఓ రత్నం మాట్లాడుతూ ఈ వేసవి శిబిరం ద్వారా పిల్లలకు తమ ప్రతిభను ప్రదర్శించే మంచి అవకాశం లభించిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 45 మంది పిల్లలు పాల్గొంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలసదనం పర్యవేక్షకురాలు విజయకుమారి, బాలల సహాయ కేంద్రం సమన్వయకర్త యాదగిరి, కళా ఉపాధ్యాయురాలు దీపతో పాటు సిబ్బంది నవనీత, ప్రశాంతి, నవీన్, నీరజ, నందిని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పిల్లల ప్రతిభ వికాసమే లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News