Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:36 AM

పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక

21-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలి: కంపాటి పృథ్వీ

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) 23వ జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ యానాల వీరారెడ్డి నగర్ లో నిర్వహించారు. ఈ మహాసభల్లో పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా భీమనపల్లి ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా మాలోత్ చందర్ రావు తో పాటు మొత్తం తొమ్మిది మందితో కూడిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభల్లో పాల్గొన్న పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథ్వీ మాట్లాడుతూ, విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పిడిఎస్యు నిరంతరం పోరాటాలు చేస్తోందని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తోందని తెలిపారు. విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల మధ్య కొనసాగుతున్న సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పిడిఎస్యు పోరాటం కొనసాగిస్తోందని అన్నారు. గతంలో జరిగిన ఉద్యమాల నుంచి గుణపాఠాలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు జిల్లా నాయకులు ప్రకాష్, చందర్ రావు, ఉపాధ్యక్షులు శిరీష, సహాయ కార్యదర్శి నితిన్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, అలాగే శ్రీనాథ్, దినేష్, కార్తీక్, ఉమేష్, సాయి, కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News