Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ సభ్యులు

29-01-2026 113 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండలం పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం అనంతరం పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురై అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా విద్యార్థులకు వాంతులు, తలనొప్పి, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే స్పందించి బాధిత విద్యార్థులను నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.విషయం తెలుసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అఖిల్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బాధిత విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.విద్యార్థుల ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.అనంతరం జిల్లా అధ్యక్షులు బైండ్ల కృష్ణ మాట్లాడుతూ, పాఠశాలలో ఇలాంటి దుర్ఘటన జరగడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన లోపాలు, నిర్లక్ష్యం కారణమా అనే విషయాలను సంబంధిత అధికారులు పూర్తిగా విచారణ చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాఠశాలల్లో ఆహార నాణ్యతను క్రమం తప్పకుండా పరిశీలించాలని కోరారు.బాధిత విద్యార్థులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా సంస్థ తరపున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం పట్ల ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను పరామర్శించిన:నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా కమిటీ సభ్యులు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News