Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన – బాధ్యులపై కఠిన చర్యలు

19-02-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి సంబంధించి, ఆ రోజు ఈటివి మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో “భోజనం సరిగా పెట్టడం లేదని రోడ్డెక్కిన విద్యార్థులు” అనే శీర్షికతో ప్రతికూల వార్తలు ప్రసారమయ్యాయి. ఈ విషయాన్ని జిల్లా పరిపాలన అత్యంత గంభీరంగా పరిగణించింది. జిల్లా కలెక్టర్, సంగారెడ్డి మరియు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఆహార భద్రత కమిటీ సభ్యులు మరియు సహాయక నర్సుకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయబడినవి.తదుపరి, అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయురాలు మరియు ఆహార భద్రత కమిటీ సభ్యులు సమర్పించిన వివరణలు సంతృప్తికరంగా లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కె. బాలమణి యొక్క అదనపు బాధ్యతలను ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నుండి తొలగించడం జరిగింది. అనంతరం డి. దత్తు, ప్రభుత్వ గిరిజన బాలుర వసతిగృహం సంగారెడ్డి లో పనిచేస్తున్న ఆరోగ్య సంక్షేమ అధికారి స్థాయి–ఒకరు, వారికి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా అదనపు బాధ్యతలు అప్పగించబడినవి.ఇదే క్రమంలో ఆహార భద్రత కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న ఎ. రవి, బి. జైపాల్, కె. శ్రీనివాస్ లను నారాయణఖేడ్ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నుండి బొమ్మారెడ్డి గూడెం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు బదిలీ చేయడం జరిగింది. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, బొమ్మారెడ్డి గూడెం పాఠశాలలో వారు బోధిస్తున్న విషయాలకు సంబంధించిన ఉపాధ్యాయులను నారాయణఖేడ్ బాలుర ఆశ్రమ పాఠశాలకు తక్షణమే బదిలీ చేయడం జరిగింది. విద్యార్థుల విద్యాభ్యాసం ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకుండా తగిన ఏర్పాట్లు చేపట్టబడినవి.పైన పేర్కొన్న ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలలలో వెంటనే విధుల్లో చేరవలసిందిగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడినవి. ఈ ఆదేశాల అమలులో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించిన పక్షంలో సంబంధితులపై కఠిన పరిపాలనా చర్యలు తీసుకోబడతాయని జిల్లా పరిపాలన స్పష్టం చేసింది.విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన ఆహారం, మరియు సక్రమమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా పరిగణించబడుతూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన పర్యవేక్షణ చర్యలు కొనసాగించబడతాయి.

Sthanikam

ఫిర్యాదులపై వేగవంతమైన స్పందన – బాధ్యులపై కఠిన చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News