Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి.
February 03, 2026 07:15 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- కార్మిక సంఘాల జిల్లా సదస్సులో CITU ఆల్ ఇండియా వర్కింగ్ కమిటి సభ్యులు జె మల్లికార్జున్ పిలుపు

నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని ఫిబ్రవరి 12 న జరిగే దేశ వ్యాప్త కార్మిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనిసమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల జిల్లా సదస్సులో CITU ఆల్ ఇండియా వర్కింగ్ కమిటి సభ్యులు జె మల్లికార్జున్ కార్మికులకు పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 12 సమ్మె జయప్రదం కోరుతూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం CITU జిల్లా కార్యాలయంలో CITU జిల్లా అధ్యక్షుడు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, IFTU జిల్లా అధ్యక్షుడు పద్మా సుదర్శన్, BRTU జిల్లా అధ్యక్షుడు డిల్లీ మాధవరెడ్డి ల అధ్యక్షతన కార్మిక సంఘాల జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జె మల్లికార్జున్ గారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల వల్ల భవిష్యత్ లో కార్మికులను పర్మినెంట్ అనే మాట ఉండదని దాని స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ మెంట్ అనే విధానం తీసుకువచ్చి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా చేశారని విమర్శించారు.స్వాతంత్రానికి పూర్వం నుండి మన వారు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.కార్మికుల ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచుతూ,కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును ప్రశ్నార్థకం చేస్తూ లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు.

దేశంలో నేటికి 40 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు,10 కోట్ల మంది పారిశ్రామిక కార్మికులకు ఈ నూతన లేబర్ వలన తీవ్రంగా నష్టం జరుగుతుందని తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు కోత పెట్టి రాష్ట్రాల పైన 40 శాతం భారం మోపి భవిష్యత్తులో ఉపాధి పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తుందని మరోవైపు విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చి రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా చేస్తుందని బిజెపి ప్రభుత్వ కార్మిక ,రైతు వ్యతిరేక విధానాలపై జరిగే సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జనార్ధన్,CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం,BRTU జిల్లా అధ్యక్షులు డిల్లీ మాధవరెడ్డి ,,IFTU జిల్లా కార్యదర్శి గడ్డం నాగరాజు,INTUC జిల్లా నాయకులు రాజిరెడ్డి,AITUC జిల్లా కార్యవర్గ సభ్యులు శ్యామల శోభన్ బాబు లు మాట్లాడుతూ... ఆధునిక బానిసలుగా మార్చే విధంగా లేబర్ కోడ్ లకు తీసుకువచ్చారని విమర్శించారు.లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో మన జిల్లాలోనీ అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మె జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. సమ్మె జయప్రదం కోసం ఫిబ్రవరి 06 వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది.ఈ కార్మిక సంఘాల జిల్లా సదస్సులో CITU జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు,దోనూరి నర్సిరెడ్డి,మాయ కృష్ణ,జిల్లా సహాయ కార్యదర్శులు తుర్కపల్లి సురేందర్,గొరిగే సోములు,చెక్క రమేష్,ఫైళ్ళ గణపతి రెడ్డి,పొట్ట యాదమ్మ,IFTU నాయకులు కల్లేపు చంద్రయ్య,శ్రీశైలం,రామచంద్రం,మార్కండేయ,AITUC నాయకులు భాస్కర్,CITU నాయకులు ఆదిమూలం నందీశ్వర్,పోతరాజు జహంగీర్, ఉమర్,సి హెచ్ శ్రీను,వెంకటయ్య,సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News