Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:26 AM

ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు

ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు

ఫిబ్రవరి 12న జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు
February 07, 2026 09:20 PM 84 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కార్మికులు పోరాటాలతో సాధించుకున్న29 కార్మిక చట్టాలను కుదించి కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా అమలు చేయడానికి పూను కొందని కార్మికు లకు నష్టం కలిగించే 4 కోడ్ల ను కార్మికులు తిరస్క రించాలని ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చేయాల ని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఏలూరు జిల్లా కార్యదర్శి డి పుల్లారావు పిలుపు నిచ్చారు. శనివారం మండల కేంద్రమైన చాట్రాయిలో కార్మికులతో కలిసి కరపత్రాలు విడుదల చేసి పంచిపెట్టారు. సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలోఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికుల వ్యతిరేక ప్రభుత్వాలని, పెట్టుబడిదారులకు అనుకూలంగా నిర్ణయా లు చేస్తున్నారని వెంటనే కేంద్రం తెచ్చిన 4 కోడ్లను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశా రు. మోడీప్రభుత్వం 4 కార్మిక కోడ్ లను అమలు చేయడానికి సిద్ధమైందని నవంబర్ 21న నోటిఫికేషన్ జారీ చేసి అమలు చేయడానికి అవసరమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తుందని ఆయన తెలిపారు. కోడ్లు వల్ల కార్మికులకు మంచి జరుగుతుందని ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా చేస్తోందని ఆయన విమర్శించారు. కార్మికులు పోరాడి సాదించుకున్న 29 చట్టాలను రద్దుచేసి కేంద్రం తెచ్చిన ఈ 4 కోడ్ లు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలలో మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం ఇవ్వడం లేదని, మహిళలతో ప్రభుత్వాలు వెట్టిచాకిరి చేయించు కుంటున్నా యని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్కీం వర్కర్లనందరినీ ఆశా, అంగనవాడి మిడ్ డే మిల్, పాఠశాల పారిశుధ్య కార్మికులు, డ్వాక్రాలో వీఎఓలు, ఉపాధి హామీ పథకం యానిమేటర్లు, ఆరోగ్య కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 36 వేలరూపాయలు ఇవ్వాలని, ఆయన డిమాండ్ చేశారు. 2005లో అప్పటి ప్రభుత్వం అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పేరు మార్చడాన్ని పుల్లారావు తీవ్రంగా ఖండించారు. విబి రాంజీ మిషన్ పేరును మార్చడం వల్ల ఉప యోగం ఏమిటని ప్రశ్నించారు. పాత పేరుని కొనసాగించాలని పుల్లారావు డిమాండ్ చేశారు. గతంలో ఉన్న పథకం వల్ల కార్మికులు పని కావాలని అడిగే పరిస్థితి ఉండేదని, మోడీ తీసుకొచ్చినటువంటి చట్టం వల్ల ఆ హక్కును కోల్పోతామని, పని ఇచ్చినప్పుడు మాత్రమే కార్మికులు చేయాలని తెలిపారు. ఉపాధిహామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించి 200 రోజులు పని కల్పించి రోజుకు 600 రూపాయలు కూలి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు, మండల కార్యదర్శ కలపాల వెంకటేశ్వరావు, నడ్డి దేవమాత, బి, ఆనదరావు, సీతామహలక్ష్మి, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నా రు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News