Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె.. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటం: దండెంపల్లి సత్తయ్య పిలుపు

04-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మె.. కార్మిక హక్కుల కోసం ఐక్య పోరాటం: దండెంపల్లి సత్తయ్య పిలుపు

కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు.గురువారం సమ్మె ప్రచార కార్యక్రమంలో భాగంగా నెహ్రూగంజి పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం యూనియన్ కార్యాలయంలో  జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని విభజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఫిబ్రవరి 12 సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

          ఈ సమావేశంలో సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, నలగొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి యూనియన్ అధ్యక్షులు ఆవురేష్ మారయ్య, కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, కమిటీ సభ్యులు జగదీష్, దూదిమెట్ల వెంకన్న, అంజయ్య, కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News