Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:31 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు

16-03-2026 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి పెండింగ్ జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు దీర్ఘకాలంగా విడుదల కాకపోవడంతో జిల్లాలోని అనేక ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు ఐదు నెలలకుపైగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చులు, పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు వంటి దినసరి ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి నెలకొన్నదని, కొంతమందిని ఇంటి యజమానులు అద్దె కోసం ఒత్తిడి చేస్తూ ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల వైద్య సేవలు కూడా వాయిదా పడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే 2026 ఏప్రిల్ 1 నుంచి తరగతులు బోధించడం నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ్ చారి, విజయ్ చందర్, భాషిపంగు సునిల్ కుమార్, గంజికుంట్ల గోపినాథ్ (టీఎల్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి), ఇటీకాల రోజుబాబు, విజయ్ కుమార్, సాయి కుమార్, రవి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి: ప్రైవేట్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News