Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:12 PM

ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరైంది కాదు: ఎస్ఎఫ్ఐ

04-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్

ఫీజు బకాయిల చెల్లింపుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఉందని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. చౌటుప్పల్ మండలం కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్, కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులను విద్యార్థుల నుంచి వసూలు చేసుకోవాలని సూచించడం సరైంది కాదన్నారు.ఈ తీర్పు వల్ల పేద విద్యార్థులుచదువులుకొనసాగించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.ఫీజులు చెల్లించిన తరువాతే సర్టిఫికెట్లు ఇస్తామనే పరిస్థితి ఇప్పటికే విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండగా, తాజా హైకోర్టు తీర్పు మరింత నిరాశను కలిగించిందన్నారు.పేద విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా కల్పించే విధంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్,స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో హైకోర్టు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు దోనూరి శ్రావణ్, ఇరిగి వరుణ్, నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫీజు బకాయిలపై హైకోర్టు తీర్పు సరైంది కాదు: ఎస్ఎఫ్ఐ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News