Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

ఫుడ్ ఫెస్ట్‌లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

08-01-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:మనూర్ మండలం మైయికోడ్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి పాల్గొని, విద్యార్థులు స్వయంగా తయారు చేసి తీసుకువచ్చిన వివిధ రకాల వంటకాలను ఆసక్తిగా పరిశీలించారు.విద్యార్థుల సృజనాత్మకతను, వంటలలో చూపిన నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు.ఫుడ్ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో పోషకాహారం పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

ఫుడ్ ఫెస్ట్‌లో విద్యార్థుల సృజనాత్మకతను అభినందించిన:ఖేఢ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:మనూర్ మండలం మైయికోడ్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్. ఉమా హారతి పాల్గొని, విద్యార్థులు స్వయంగా తయారు చేసి తీసుకువచ్చిన వివిధ రకాల వంటకాలను ఆసక్తిగా పరిశీలించారు.విద్యార్థుల సృజనాత్మకతను, వంటలలో చూపిన నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ వారిని అభినందించారు.ఫుడ్ ఫెస్ట్ ద్వారా విద్యార్థుల్లో పోషకాహారం పై అవగాహన పెంపొందించడంతో పాటు, ఆత్మవిశ్వాసం మరియు నైపుణ్యాభివృద్ధి జరుగుతుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు.ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, గ్రామ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News