Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

ఫాసిస్టు మోడీ ప్రభుత్వం రద్దు చేసిన ఉపాధి హామీ హక్కు పథకాన్ని కాపాడుకుందాం

ఫాసిస్టు మోడీ ప్రభుత్వం రద్దు చేసిన ఉపాధి హామీ హక్కు పథకాన్ని కాపాడుకుందాం

ఫాసిస్టు మోడీ ప్రభుత్వం రద్దు చేసిన ఉపాధి హామీ హక్కు పథకాన్ని కాపాడుకుందాం
January 11, 2026 05:07 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మామిడాల బిక్షపతి,అద్యక్షులు అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏఐకెఎంఎస్)

పాత ఉపాధి హామీ పథకంకై గ్రామీణ పేదలంతా ఒక్కటై ఉద్యమించండి

ఆర్.జనార్ధన్,జిల్లా కార్యదర్శి సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

దేశంలోని గ్రామీణ పేదలపై కేంద్రంలోని బీ జే పీ మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా యుద్ధం ప్రకటించిందని,ఇరవై ఏళ్లుగా దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు,సన్న చిన్నకారు రైతు కుటుంబాలకు,మహిళలకు ఆసరాగా ఉంటూ ఆకలి,దారిద్ర్యం నుండి ఊరట పొందడానికి అండగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీ నరేగా)నియంతృత్వంగా ఎలాంటి చర్చ లేకుండా మోడీ ప్రభుత్వం దొంగ చాటుగా రద్దుచేసింది,దీని స్థానంలో పాలకుల దయపై, ఒక బిక్షగా స్కీం రూపంలో అమలు జరిగేట్టుగా కొత్తగా తెచ్చిన వికసిత్ భారత్ - గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ్)పథకాన్ని(విబిజీ రాం జీ) తిప్పికొట్టాలని,పేదలకు ఒక హక్కుగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ పేదలంతా రాజకీయాలకతీతంగా ఒక్కటై ఉద్యమించాలని అఖిల భారత రైతు.కూలీ సంఘం (ఏఐకెఎంఎస్)రాష్ట్ర అధ్యక్షులు మామిడాలభిక్ష పతి, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ పిలుపు నిచ్చారు. ఆదివారం నాడు మోటకొండూర్,వర్టూర్, పెద్దబావి, మాటూరు,ఆలేరు మండలం శల్భానపురం తదితర గ్రామాలలో గ్రామ సర్పంచులను,ఉప సర్పంచ్,వార్డు సభ్యులను, ప్రజలను ప్రత్యక్షంగా కలిసి మోడీ తీసుకు వచ్చిన గ్రామీణ వ్యవసాయ ఉపాధి కూలీలకు వ్యతిరేకమైన కొత్త ఉపాధి చట్టాన్ని రద్దు చేస్తూ గ్రామసభలలో తీర్మానించాలని కోరడం జరిగింది.

ఈ సందర్భంగా భిక్షపతి, జనార్ధన్ లు మాట్లాడుతూ,ఉపాధి హామీ చట్టం 2005 లో ఏర్పడడానికి బలమైన సామాజిక ఉద్యమాల నేపథ్యం ఉందని 1991లో ప్రపంచీకరణలో భాగంగా దేశంలో ప్రవేశపెట్టబడిన నూతన ఆర్థిక,ఉదారవాద విధానాలు ఫలితంగా గ్రామీణ వ్యవసాయ రంగంలో కూరుకుపోయి రైతుల ఆత్మ- హత్యలూ,కూలీల వలసలు,దారిద్ర్యం పెరగడమూ వంటి పరిస్థితులలో పనైనా చూపండి లేదా తిండైన పెట్టండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు,సామాజిక పౌర సమాజ సంస్థలు,ప్రజానుకూల మేధావులు ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలోనే 2004 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చటంను 2005లో అమలులోకి తెచ్చిందని అన్నారు.మూడు పర్యాయాలుగా అధికారంలో ఉంటూ,దేశ ప్రజలకు ఏమీ చేయకపోయినప్పటికి,ఫక్తూ మతం మతం అంటూ ప్రజలను విభజించి పాలించే ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ వస్తున్న బీ జే పీ మోడీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు సామాజిక,ఆర్థిక భద్రతగా ఉంటూ వస్తున్న ఉపాధి హామీ చట్టం ను రద్దు చేయడానికి పూనుకోవడంలో భాగమే రాష్ట్రాలపై 40 శాతం నిధులు భరించాలని చెప్పడం అని,ఇప్పటివరకు వంద రోజులు ఉన్న ఉపాధి హామీ పనిని 125 రోజులకు పెంచుతున్నామని గొప్పగా చెప్పి,సంవత్సరంలో 60 రోజులు వ్యవసాయ పనులకు పోగా మిగిలింది 65 రోజులేనని,మోడీ వ్యవహారం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు గా ఉన్నదని అన్నారు.పేదలు, కష్టజీవులు,వ్యవసాయ కార్మికులు మోడీ ప్రజా వ్యతిరేక కొత్త ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున బలమైన రైతు.కూలీ ఉద్యమాన్ని చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు కళ్లెపు అడివయ్య, జిల్లా నాయకులు పిన్నపురెడ్డి రాఘవరెడ్డి చిరబోయిన కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News