Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

ఫార్మా రంగానికి ఉక్కు పరిశ్రమ బలం.ఈఈపీసీ ఇండియా రోడ్‌షోలో అక్షయ్ ఎస్.సీ

15-05-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: దేశ ఫార్మాస్యూటికల్ రంగ భవిష్యత్ అభివృద్ధికి దేశీయ ఉక్కు, తయారీ పరిశ్రమల బలోపేతం కీలకమని డీజీఎఫ్‌టీఏ సంయుక్త డైరెక్టర్ జనరల్ అక్షయ్ ఎస్.సీ పేర్కొన్నారు. ఫార్మా మాక్‌టెక్ అండ్ ల్యాబ్‌నెక్స్ట్ ఎక్స్‌పో–2026 రెండో ఎడిషన్‌కు ముందుగా ఈఈపీసీ ఇండియా ఆధ్వర్యంలో బేగంపేట ఐటీసీ కాకతీయలో శుక్రవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

సెప్టెంబర్ 7 నుంచి 9 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫార్మా మాక్‌టెక్ అండ్ ల్యాబ్‌నెక్స్ట్ ఎక్స్‌పో–2026 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనను అంతర్జాతీయ ఫార్మా ఎక్స్‌పో ‘ఐఫెక్స్’తో కలిసి నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఈఈపీసీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిప్ మిత్రా మాట్లాడుతూ.. ఫార్మా 4.0, ఆటోమేషన్, ప్రెసిషన్ డ్రగ్ డెలివరీ, ఆధునిక ల్యాబ్ పరికరాల వంటి సాంకేతికతలను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాపార అవకాశాలు, కొనుగోలుదారులతో సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.

‘స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ అండ్ నెక్స్ట్‌జెన్ ల్యాబొరేటరీ సొల్యూషన్స్’ అంశంపై జరిగిన సెమినార్‌లో నిపుణులు పరిశ్రమలో ఆవిష్కరణలు, డిజిటల్ మార్పులు, ఆధునిక తయారీ విధానాలపై అభిప్రాయాలు వెల్లడించారు.

ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని, జీడిమెట్ల, బాలానగర్, కూకట్‌పల్లి ఇంజినీరింగ్ క్లస్టర్లు ఫార్మా రంగానికి ప్రధాన సరఫరా కేంద్రాలుగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఈఈపీసీ ఇండియా చైర్మన్ పంకజ్ చద్దా, సీడీఎస్‌సీఓ డిప్యూటీ డ్రగ్స్ కంట్రోలర్ కె. నరేంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఫార్మా రంగానికి ఉక్కు పరిశ్రమ బలం.ఈఈపీసీ ఇండియా రోడ్‌షోలో అక్షయ్ ఎస్.సీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News