పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం
పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం
Sthanikam District Staff Reporter
లేబర్ కోడ్స్,విబి జి రామ్ జి చట్టం,జాతీయ విత్తన చట్టం,విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి
సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు పిలుపు
మోటకొండూరు: స్థానికం ప్రతినిధి
కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ పేదలపైన, కార్మికులపైన, కర్షకులపైన,వ్యవసాయ కూలీలపైన బారాలు మోపుతున్నారని తెలంగాణ రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొమటిరెడ్డి చంద్రారెడ్డి,కల్లూరి మల్లేశం, బొల్లు యాదగిరి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలగాని జయరాములు గార్లు విమర్శించినారు. ఇప్పటికైనా లేబర్ కోడ్స్,విబి జి రామ్ జి చట్టం, జాతీయ విత్తన చట్టం, విద్యుత్తు సవరణ బిల్లును వెంటనే మోడీ ప్రభుత్వం విరమించుకోవాలని వారు డిమాండ్ చేసినారు. శనివారం రోజున మోట కొండూరు మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో సిఐటియు, తెలంగాణ రైతు సంఘం,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని,విబి జి రామ్ జి చట్టంను రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని,విత్తన చట్టంను రద్దు చేయాలని కోరుతూ " కార్మిక,కర్షక పోరుయాత్ర " కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర మోట కొండూరు పట్టణంలోకి వచ్చిన సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ... కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పార్లమెంటులో తమకు బలం ఉందని ఏకపక్షంగా కార్మికులకు,రైతులకు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా లేబర్ కోడ్స్, జి రామ్ జి చట్టం,జాతీయ విత్తన చట్టం,విద్యుత్ సవరణ బిల్లులను తీసుకొచ్చారని విమర్శించారు. మోడీ అధికారం చేపట్టిన తర్వాత కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారి కార్మికులకు, కర్షకులకు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా వారి యొక్క హక్కులను, చట్టాలను కాలరాస్తున్నాడని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రజలపై భారాల మోపుతున్నారని విమర్శించారు.కార్మికులు,కర్షకులు, వ్యవసాయ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను, జీవోలను మార్చి వారి పొట్టలు కొడుతున్నారని తెలిపారు. మోడీ తీసుకొచ్చిన చట్టాలు,బిల్లులు అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పరిశ్రమల కార్మికులకు రానున్న కాలంలో ఇప్పటి వరకు పొందుతున్న హక్కులు, సౌకర్యాలు లేకుండా పోతాయని అన్నారు. యాజమాన్యాలు తన ఇష్టానుసారంగా కార్మికుల చేత పనిచేయించుకుంటాయని, కార్మికులపై మరింత నిర్బంధం పెరుగుతుందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తుందని అన్నారు.విద్యుత్తు ప్రైవేటీకరణ దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం చేయనున్నదని, అది గనుక అమలు జరిగితే రైతాంగం చేసిన కష్టమంతా కరెంటు బిల్లులకే సరిపోతుందని, రైతాంగం అప్పులపాలై గతంలో మాదిరిగా ఆత్మహత్యల పరంపర కొనసాగనున్నదని అన్నారు. వ్యవసాయంను పడవాపెట్టి పట్టణాలకు వలసలు వెళ్లి కూలి పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని స్కీముగా మార్చి నూటికి 60 శాతం నిధులు మాత్రమే కేంద్రం భరిస్తామని, మిగతా 40 శాతం రాష్ట్రాలు భరించాలని పార్లమెంటులో ఆమోదం తీసుకున్నదని అన్నారు. దీన్ని అమలు జరిపితే దేశంలో ఉపాధి హామీ పనులు బందై అందులో పనిచేస్తున్న వ్యవసాయ కార్మికులు, పేద రైతులు, అన్ని వర్గాల పేద ప్రజల బ్రతుకు ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితులున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. విత్తన సవరణ బిల్లు ద్వారా విత్తనాల ధరలు మరింత పెరుగునున్నాయని,తెలంగాణ రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి కేంద్రాల మీద కేంద్రం పెత్తనం చేయనున్నదని అన్నారు.విత్తనోత్పత్తిలో బహుళ జాతి కంపెనీల ప్రమేయం పెరగనున్నదని అన్నారు. రైతాంగానికి కనీస మద్దతు ధర పెంచే కాడ గాని, వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు పెంచే కాడ బిజెపి ప్రభుత్వానికి చేతులు రావట్లేదని అన్నారు. అందుకే కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 19వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన సభలల్లో కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కూలీలు, పేదల పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు,సిఐటియు జిల్లా నాయకులు కొల్లూరి ఆంజనేయులు,మండల నాయకులు వడ్డేబోయిన మహేందర్,గోసంగి పరమేశ్వర్, బోగారం వీరాస్వామి,కొల్లూరి రమేష్, ఆడేపు ఇస్తారి, బి.సర్వయ్య,రవి, ఎం అశోక్,ఏ చంద్ర కళ, బి.అరుణ, మైసయ్య,పెద్దులు,యాదమ్మ, ఎల్లమ్మ,ఉపేంద్ర,చంద్రమ్మ,స్వరూప,విఠల్, లావణ్య,భిక్షపతి,అంజయ్య,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి