Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:36 PM

పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగా ఉన్నాయి: అడిషనల్ కలెక్టర్

26-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలో పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ వంటగ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని అడిషనల్ కలెక్టర్ మాధురి స్పష్టం చేశారు.గురువారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇంధన నిల్వల పరిస్థితిని పరిశీలించిన ఆమె, ప్రస్తుతం జిల్లాలో అవసరానికి తగినంత నిల్వలు ఉన్నాయని, పెట్రోల్ బంకులు మరియు గ్యాస్ ఏజెన్సీలకు సరఫరాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇటీవల కొన్ని బంకుల వద్ద కనిపిస్తున్న క్యూల కారణంగా కొరత ఉందనే వదంతులు వ్యాపిస్తున్నాయని,అయితే ప్రజలు అవసరానికి మించి ముందస్తుగా నిల్వ చేసుకోవడం వల్లే డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు.సాధారణంగా రోజుకు సుమారు 10 వేల ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్స్ ఉండగా,వదంతుల ప్రభావంతో అది 16 వేల వరకు పెరిగిందని, అయినప్పటికీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్‌ను కంటైనర్లు లేదా డబ్బాల్లో నిల్వ చేయడం చట్టవ్యతిరేకమే కాకుండా ప్రమాదకరమని హెచ్చరించారు.గ్యాస్ ఏజెన్సీలు, డీలర్ల కార్యకలాపాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో డీఎం సివిల్ సప్లై అంబదాస్, ఏఎస్‌వో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్రోల్, డీజిల్, గ్యాస్ సమృద్ధిగా ఉన్నాయి: అడిషనల్ కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News