Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఎం నిరసన

17-05-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై పెను భారం మోపుతోందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మండిపడ్డారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ బస్టాండ్ ఎదుట పెట్రోల్ బంక్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, గంగాదేవి సైదులు, గోశిక కరుణాకర్ మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను పెంచి ప్రజలను మోసం చేసిందన్నారు. ఇంధన ధరల పెరుగుదలతో అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపుతూ ఇంధన ధరలను పెంచడం ప్రజల నడ్డి విరిచే చర్య అని విమర్శించారు. ఎన్నికల ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచబోమని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే రూ.3కు పైగా పెంచడం ప్రజల విశ్వాసాన్ని ద్రోహంచేయడమేనన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆకుల ధర్మయ్య, బత్తుల దాసు, కొండే శ్రీశైలం, బోయి యాదయ్య, తోర్పునూరి మల్లేశం, కందగట్ల ఆనంద్, భావనలపల్లి స్వామి, యాట బాలరాజు, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ రహీం, మానే శాలయ్య, భీమగొని బాలరాజు, యాట ముత్యాలు, వల్లూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఎం నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News