Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:25 AM

పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా ఉగ్గే రాజేష్

19-05-2026 133 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణ పెరిక కుల సంఘం ఎన్నికలు ఆదివారం ఘనంగా నిర్వహించగా, సంఘ సభ్యుల ఏకాభిప్రాయంతో ఉగ్గే రాజేష్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా బుర్రి రవీందర్, గౌరవాధ్యక్షుడిగా గరిక సత్యనారాయణ, కోశాధికారిగా కానుగంటి మునిశ్వర్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరినీ ఎన్నుకున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా సంఘం అధ్యక్షుడు తిప్పని పరమేష్, కార్యదర్శి కోట సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఉగ్గే రాజేష్ మాట్లాడుతూ… కుల బంధువుల సంక్షేమం కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మంచి–చెడు కార్యక్రమాల్లో కార్యవర్గంతో కలిసి ముందుండి సేవలు అందిస్తామని తెలిపారు. కుల ఐక్యత బలోపేతానికి కృషి చేస్తామని, త్వరలోనే కుల భవన నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా సంఘం తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారు కొమిరిశెట్టి నరసింహులు, కోశాధికారి దాచేపల్లి రాజు, రాజాపేట ప్రధాన కార్యదర్శి అంకతి బిక్షపతి, ఎన్నారం అధ్యక్షుడు మద్ది రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెరిక కుల సంఘం అధ్యక్షుడిగా ఉగ్గే రాజేష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News