Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:30 AM

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

18-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చందన బ్రదర్స్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వైటీ భీమరాజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్‌ నాయకుడు కె.అజయ్‌బాబు, రాష్ట్ర సమితి సభ్యుడు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న ఇంధన ధరలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల భారం మరింత పెరిగిందన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు.

పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, చమురుపై విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి.ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్‌, దేవా, నరసింహులు, వీరేష్‌తో పాటు హమాలి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏఐటీయూసీ ఆగ్రహం. ధరలు తగ్గించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు

Article Image

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చందన బ్రదర్స్‌ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ పట్టణ ప్రధాన కార్యదర్శి వైటీ భీమరాజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ సీనియర్‌ నాయకుడు కె.అజయ్‌బాబు, రాష్ట్ర సమితి సభ్యుడు ఓబి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా పెంచుతున్న ఇంధన ధరలను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్యులు, దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలపై ఈ ధరల భారం మరింత పెరిగిందన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, కూరగాయలు, పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఉపశమనం కల్పించకుండా ప్రభుత్వాలు పన్నుల రూపంలో భారాన్ని మోపుతున్నాయని విమర్శించారు.

పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, చమురుపై విధిస్తున్న ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు బి.ఎంకన్న, కల్లుబావి రాజు, ఈరన్న, రాజేష్‌, దేవా, నరసింహులు, వీరేష్‌తో పాటు హమాలి, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News