Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

పెరటి కోళ్ల అకాల మరణాల నివారణకు సర్జికల్ స్పిరిట్ వైద్యం

23-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

పెరటి కోళ్ల అకాల మరణాల నివారణకు సర్జికల్ స్పిరిట్ వైద్యం

ప్రతీ కుటుంబానికి పెరటికోళ్లు జీవ నిధిగా నిరంతరం ఆదాయాన్నిస్తూ కుటుంబ పోషణకి ఉపయోగపడుతున్నాయి.కోదాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా పెరటికోళ్లకి వైరస్ సోకి అకస్మాత్తుగా చనిపోతున్నాయి. రోజంతా మంచిగా తిని , నీరు తాగి చెట్ల మీద పడుకున్న కోళ్లు తెల్లారేసరికి మృత్యువాత పడుతున్నాయి. కొక్కెర రోగానికి ముందస్తుగా టీకాలు వేసిన కోళ్లు సైతం జబ్బున పడుతున్నాయి. కొక్కెర రోగం సోకిన కోళ్లు సైతం కీళ్ల జబ్బులు సోకి కాళ్లు వంకర్లు పోతూ నడవలేక తినలేక తిన్నది అరగక ఇబ్బంది పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా నిత్యం జబ్బు సోకిన కోళ్లతో కోదాడ ప్రాంతీయ పశువైద్యశాల కిటకిటలాడుతుంది.

జబ్బు సోకిన కోళ్లని పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య వివిధ ఔషధాలతో వైద్యం చేస్తున్నా పూర్తిస్థాయిలో ఫలితం లేకపోవడం తో “ఓల్డ్ ఇజ్ గోల్డ్ “అన్న సామెత అనుసరించి పాతకాలంలో వైద్యం కోసం వాడిన సర్జికల్ స్పిరిట్ ని ఉపయోగించి ఈరోజు కోళ్ళకి నూతన వైద్యం ప్రారంభించారు.

జబ్బు సోకిన, కాళ్ళు పడిపోయిన కోళ్ళకి ఇన్సులిన్ సిరంజిలో 15 యూనిట్ల సర్జికల్ స్పిరిట్ తీసుకొని దానికి 35 యూనిట్స్ నార్మల్ డిస్టిల్డ్ వాటర్ కలిపి కోడి రెక్క రక్తనాళం లోకి ఎక్కించి, యాంటీబయాటిక్,బి కాంప్లెక్స్,నరాల టానిక్ ఇంజక్షన్ లు కూడా కండకి ఇవ్వడం ప్రారంభించారు. విషయం తెలిసి సర్జికల్ స్పిరిట్ వైద్యం కోసం కోళ్ళతో యజమానులు ప్రాంతీయ పశువైద్యశాలకు బారులు తీరారు.

అలాగే వైరస్ వ్యాధులు సోకకుండా ముందస్తుగా నివారణకోసం , వైద్యశాలకు వచ్చిన రైతులందరికీ 100 మిల్లీ లీటర్ల నీటిలో 15 మిల్లీ లీటర్ల స్పిరిట్ కలిపి ఒక్కో కోడికి 1.5 మి లీటర్లు పిల్లలకి నాలుగైదు చుక్కలు వారంరోజుల పాటు నోటిలో వేయడానికి సరిపడు ద్రావణం కలిపి ఇవ్వడం జరిగింది.

అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి పెంటయ్య మాట్లాడుతూ ఈ సీజన్ లో విరివిగా కోళ్లలో వైరస్ వ్యాధులు సోకుతాయని, ముందస్తు టీకాలు వేసినవాటికి సమస్య లేదు కానీ జబ్బు సోకి లక్షణాలు కనిపించడానికి వారం నుండి 14 రోజుల సమయం ఇంక్యుబేషిన్ పీరియడ్ పడుతుందని ఈ సమయం లో మాత్రం టీకాలు వేయరాదని, అలా వేసినట్లయితే ఉపయోగం లేకపోగా వైరస్ సోకిన కోళ్ళకి తిరిగి టీకా రూపేణా వైరస్ ఎక్కిస్తే వైరస్ తీవ్రత పెరిగి కోళ్లు చనిపోతాయని తెలిపారు.

సీనియర్ వైద్యుల సలహా మేరకు కోళ్లలో వ్యాధుల చికిత్స మరియు నివారణకు ఈరోజు మనదగ్గర సర్జికల్ స్పిరిట్ తో వైద్యం ప్రారంభించడం జరిగిందని ఇప్పటికైతే మంచి పలితాలున్నాయని, మునుముందు అసలు జబ్బులే సోకకుండా కాపాడడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

వ్యాధి మరింత విస్తరించకుండా జబ్బు సోకిన కోళ్లను గుంపు నుండి వేరు చేసి విడిగా ఉంచాలని, శక్తికోసం నీటితో గ్లూకోజ్ మరియు సమయానికి మేత ఇవ్వాలని, చనిపోయిన కోళ్లను బైట పడవేయకుండా గుంత తీసి ఉప్పు లేదా సున్నంతో పూడ్చి పెట్టాలని, పైన చెప్పిన విధంగా ప్రతీ ఇంట్లో తమకోళ్ళకి స్పిరిట్ ద్రావణం ఔషధాన్ని తాగించాలని సూచించారు.

చికిత్సా కార్యక్రమములో సిబ్బంది రాజు, చంద్రకళ పాల్గొన్నారు

Sthanikam

పెరటి కోళ్ల అకాల మరణాల నివారణకు సర్జికల్ స్పిరిట్ వైద్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News