Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి

29-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మడకసిర రోడ్డులోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ, అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నాయకులు వస్తూ పోతుంటారని, కానీ పార్టీ శాశ్వతమని, కష్టపడ్డ కార్యకర్తలే పార్టీకి బలమని ఎంపీ బి.కే. పార్థసారథి అన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా – కార్యకర్తలే పార్టీ బలం: ఎంపీ బి.కే. పార్థసారథి

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మడకసిర రోడ్డులోని పార్లమెంట్ సభ్యుల కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కే. పార్థసారథి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ, అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని నేతలు పేర్కొన్నారు. సమాజమే మా దేవాలయం, ప్రజలే మా దేవుళ్లు అన్న ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

నాయకులు వస్తూ పోతుంటారని, కానీ పార్టీ శాశ్వతమని, కష్టపడ్డ కార్యకర్తలే పార్టీకి బలమని ఎంపీ బి.కే. పార్థసారథి అన్నారు. పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు ఐక్యంగా కృషి చేయాలని సూచించారు.

అనంతరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుకొండ నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News