Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష

19-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత & జౌళి శాఖామాత్యులు శ్రీమతి సవిత విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని విద్యుత్ సరఫరా పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.

రైతులకు అందుతున్న విద్యుత్ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి, ట్రాన్స్‌ఫార్మర్లపై పెరుగుతున్న లోడ్, మార్పిడి వేగం, గ్రామీణ విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్కువ వోల్టేజ్, ఓవర్‌లోడ్ సమస్యలు, పాడైన లైన్ల మరమ్మత్తులు, కొత్త లైన్ల ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

రైతుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించిన మంత్రి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. సమావేశంలో యస్ఇ మోసెస్, డిఇ లు చంద్రనాయక్, జ్యోత్స్న, ఎడి శేషగిరి, ఎఇ లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో విద్యుత్ సమస్యలపై మంత్రి సవిత సమీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News