Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

పెనుకొండలో బీజేపీ నిరసన ర్యాలీ – కాంగ్రెస్‌పై ఆగ్రహం

23-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా / పెనుకొండ:

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బిల్లు కుల్లాయప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీగా సాగింది.

ర్యాలీ అనంతరం నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ, కాంగ్రెస్ నాయకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టను పెంచుకుంటోందని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ వంటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల ద్వారా భారతదేశం సాంకేతిక రంగంలో ముందంజలో నిలుస్తోందని తెలిపారు. అలాంటి సందర్భంలో దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం బాధాకరమని విమర్శించారు.

దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రజలతో కలిసి పనిచేయాలని, లేకపోతే ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కూటమి ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో బీజేపీ నిరసన ర్యాలీ – కాంగ్రెస్‌పై ఆగ్రహం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News