Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

23-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ ఐసిడిఎస్ కార్యాలయం ముందు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో,సెంటర్ అఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) మద్దతుతో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షురాలు జయమ్మ, కార్యదర్శి బావమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మండల కన్వీనర్ బాబావలి మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అర్బన్, రూరల్ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందరికీ అమలు చేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్ట గైడ్లైన్స్ రూపొందించాలని తెలిపారు. మే నెలంతా వేసవి సెలవుల జీఓ వెంటనే విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు.

లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు పరిమాణం పెంచి, మెనూ చార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని, ఫ్రీ స్కూల్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు తిప్పన్న, యూనియన్ కోశాధికారి మా బున్నీసా, సెక్టార్ లీడర్లు లక్ష్మీదేవి, అనిత, సరస్వతి, పార్వతి, శాంతి భాయ్, మీనా, సుజాత, సుధామణి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పెనుకొండలో అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News