Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:47 AM

పెనుకొండలో ఆదికవయిత్రి మొల్ల జయంతి

పెనుకొండలో ఆదికవయిత్రి మొల్ల జయంతి

పెనుకొండలో ఆదికవయిత్రి మొల్ల జయంతి
13-03-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఆదికవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా పెనుకొండ పట్టణంలో కార్యక్రమం నిర్వహించారు. పెనుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు సవిత సూచనల మేరకు పెనుకొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం మొల్ల జయంతి వేడుకలు జరిపారు.

ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు కలిసి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సులభమైన తెలుగు భాషలో మొల్ల రామాయణం రచించి తెలుగు సాహిత్యానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.

మహిళలు కూడా సాహిత్యం, జ్ఞానంలో ఉన్నత స్థాయికి ఎదగగలరని మొల్ల జీవితం ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి, సాహిత్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెనుకొండ టిడిపి అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, నాయకులు ప్రభంజన్ స్వామి, చెండ్రాయుడు, కురబ నంజుండ, కుమ్మరి ఆంజనేయులు, ఎస్.రాము, పులుగూర శ్రీనివాసులు, బీజేపీ రామకృష్ణ, బోయ సోము, మల్లికార్జున, జనసేన శ్రీదేవి, సలీం బాషా, ఇక్బాల్, అమాన్, గంగన్నతో పాటు టిడిపి/ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో ఆదికవయిత్రి మొల్ల జయంతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News