Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

పెనుకొండలో అభివృద్ధి జోరు – రూ.40 లక్షల పనులకు భూమిపూజ, పూల మార్కెట్ ప్రారంభం

పెనుకొండలో అభివృద్ధి జోరు – రూ.40 లక్షల పనులకు భూమిపూజ, పూల మార్కెట్ ప్రారంభం

పెనుకొండలో అభివృద్ధి జోరు – రూ.40 లక్షల పనులకు భూమిపూజ, పూల మార్కెట్ ప్రారంభం
April 04, 2026 07:18 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. ఈ సందర్భంగా రూ.40 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఘనగిరి పూల మార్కెట్‌ను ఆమె ప్రారంభించారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు రూ.6 లక్షల వ్యయంతో పూల మార్కెట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన పారిశుధ్య సౌకర్యాలు అందించేందుకు రూ.50 లక్షలతో శానిటేషన్ సెంటర్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. త్వరలోనే రూ.5 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మడకసిర రోడ్ వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, పెనుకొండ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తూ, ఆయన తరచూ మాట మార్చే వ్యక్తి అని ఆరోపించారు. పార్టీ ఉనికికోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

అమరావతి విషయంలో అన్ని పార్టీలూ మద్దతు పలికినా, వైసీపీ మాత్రం వెనుకంజ వేసిందని పేర్కొన్నారు. అమరావతి రైతులు, మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందుల కారణంగా ప్రజల్లో ఆ పార్టీపై వ్యతిరేకత పెరిగిందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News