Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

19-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్ హనుమంత రావు

పీఎం శ్రీ నిధుల నుంచి మంజూరైన పాఠశాలల్లో సివిల్ పనులు పెండింగ్ లేకుండా ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పీఎం శ్రీ పథకం కింద చేపట్టిన పనుల పురోగతిపై అధికారులను కలెక్టర్ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలకు మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం ఎంత మేర వినియోగించారో ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, కంప్యూటర్ ల్యాబ్‌లు, అదనపు తరగతి గదులు, లైబ్రరీ గదుల నిర్మాణానికి మంజూరైన నిధులతో చేపట్టిన పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సూచించారు. కోటమర్తి, మల్లాపూర్, భువనగిరి గంజ్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను గుర్తించి, నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీర్‌కు ఆదేశించారు. పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్ణీత కాలవ్యవధిలో సక్రమంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులతో నిరంతర సమన్వయం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్,డివిజనల్ ఇంజనీర్ శివకుమార్, ప్రధానోపాధ్యాయులు మరియు అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Sthanikam

పీఎం శ్రీ పాఠశాలల్లో పెండింగ్ లేకుండా సివిల్ పనులు పూర్తి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News