Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి. జూన్‌ 18న ‘చలో హైదరాబాద్‌’కు పిలుపు

08-06-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) నాయకులు డిమాండ్‌ చేశారు. జూన్‌ 18న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నల్గొండలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.

రాష్ట్రంలోని డ్రెయినేజీ పనుల నుంచి భారీ సాగునీటి ప్రాజెక్టుల వరకు చేపడుతున్న కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎలాంటి సిఫార్సులు, ప్రభావాలు లేకుండా సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులు విడుదల చేయాలని కోరారు.

ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుంటున్నప్పటికీ, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను ఆలస్యం చేయడం వల్ల కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు, సరఫరాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇది లక్షలాది కుటుంబాల జీవనోపాధికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

అత్యవసర, ప్రాధాన్య పనులను కొనసాగిస్తూ, ప్రస్తుతం అమలు చేయడం సాధ్యం కాని పనులను తాత్కాలికంగా నిలిపివేసి వాటికి సంబంధించిన డిపాజిట్లు, సెక్యూరిటీ డిపాజిట్లు, పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్టర్లు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములేనని, నిర్మాణ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పారదర్శకంగా బిల్లులు చెల్లించాలని కోరారు.

సమావేశంలో బీఏఐ ఆల్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు ఎస్‌.ఎస్‌.రెడ్డి, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.వి.ఎన్‌.రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి.హెచ్‌.శ్రీనివాసరావు, రాష్ట్ర ఖజాంచి జి.సంతోష్‌రెడ్డి, నల్గొండ సెంటర్‌ చైర్మన్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ ఎస్‌.కృష్ణారావుతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

.

Sthanikam

పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి. జూన్‌ 18న ‘చలో హైదరాబాద్‌’కు పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News