Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:37 PM

పేదలకు అండగా ‘అయ్యప్ప ఫౌండేషన్’:ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్

పేదలకు అండగా ‘అయ్యప్ప ఫౌండేషన్’:ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్

పేదలకు అండగా ‘అయ్యప్ప ఫౌండేషన్’:ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్
February 19, 2026 07:23 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆర్మూర్ నియోజకవర్గస్థాయి ప్రజలకు సేవ చేసేందుకే అయ్యప్ప ఫౌండేషన్ ను ఏర్పాటు చేశామని మాజీ మున్సిపల్ చైర్మన్, అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా అయ్యప్ప ఫౌండేషన్ సంస్థను ప్రారంభించారు. ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ అయ్యప్ప శ్రీనివాస్ చైర్మన్ గా పట్టణ ప్రజలకు మంచి సేవలు అందించారని కొనియాడారు. ఇప్పుడు అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో గొప్ప విషయం అన్నారు. అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కౌన్సిలర్ నుండి మున్సిపల్ చైర్మన్ గా ప్రజలకు మంచి సేవలు అందించానని అన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధుల గుట్టపై తన సొంత ఖర్చులతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని నిర్మించామని, ఆ స్వామి వారి పేరును తన ఇంటిపేరుగా మార్చుకున్నానని అని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రజలకు, పేదవారికి నా వంతుగా సేవ చేయాలని ఉద్దేశంతోనే ఫౌండేషన్ ను ప్రారంభించామని తెలిపారు. ఫౌండేషన్ సేవలను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రెసిడెంట్ వన్నెల్ దేవి అయ్యప్ప శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ చేపూర్ గణేష్, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ట్రెజరర్ వన్నెల్ దేవి లావణ్య, ముఖ్య సలహాదారులు రిటైర్డ్ ఎంఈవో సాయన్న, రిటైర్డ్ టీచర్ ఆకుల గంగాధర్, శెట్పల్లి నారాయణ, పుట్టి మురళీ, తేడ్డు బాల్ రెడ్డి, పుప్పాల రాజలింగం, జంబి హనుమన్ ఆలయ మాజీ చైర్మన్ గోర్త దేవేందర్, వార్త రాజేందర్, బొబిడే గంగమోహన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు మల్లేష్ గౌడ్, ఒడ్డేన్న, మధుసూదన్, లింబాద్రి గౌడ్, మోహన్, లక్ష్మణ్, నరసయ్య, గిరి, అల్లకొండ హరీష్, లింగం పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News