Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:26 AM

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

15-05-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్దా మండల షాపూర్ గ్రామానికి చెందిన ఎస్గి నాగశెట్టి కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహాన్ని సందర్శించిన ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నివాసం అవసరమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన గృహంలో ఆ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాల మధ్య జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహాలింగ్ పటేల్, సిద్దప్ప, విజయ్ కుమార్ స్వామి తదితరులు, గ్రామస్తులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Sthanikam

పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నాగల్గిద్దా మండల షాపూర్ గ్రామానికి చెందిన ఎస్గి నాగశెట్టి కుటుంబం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహాన్ని సందర్శించిన ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన నివాసం అవసరమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన గృహంలో ఆ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాల మధ్య జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహాలింగ్ పటేల్, సిద్దప్ప, విజయ్ కుమార్ స్వామి తదితరులు, గ్రామస్తులు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News