Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:08 PM

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి

 పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. గుత్తా సుఖేందర్ రెడ్డి
March 22, 2026 02:11 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

48 మంది లబ్ధిదారులకు రూ. 19 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..

నల్గొండ : పేద ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 48 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 19,00,000 విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని కొనియాడారు.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఒక వరమని ఇది ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అట్టడుగు వర్గాలకు చేరువవుతున్నాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. సకాలంలో తమకు ఆర్థిక సాయం అందడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News