Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:14 PM

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

02-04-2026 192 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పేద ప్రజల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)కి విరివిగా విరాళాలు అందించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పల్లె శేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో “ఇంటింటికి సిపిఐ” కార్యక్రమాన్ని ప్రారంభించి సామూహిక నిధుల సేకరణ చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925లో స్థాపితమైన సిపిఐ దేశ స్వాతంత్ర్య సాధనతో పాటు పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది త్యాగాలతో అనేక గ్రామాలను విముక్తి చేసి లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘన చరిత్ర సిపిఐదేనని అన్నారు.ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ పోరాటాల గడ్డగా పేరుపొందిందని, దేశవ్యాప్తంగా భూసంస్కరణల కోసం “దున్నేవాడికే భూమి” నినాదంతో పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐకే ఉందన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఈ పార్టీకి ప్రజలు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు, కార్మికులు, ఉద్యోగులు, రైతులు అందరూ తమ వంతు సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, కొండూరు వెంకటేష్, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, టంగుటూరి రాములు, నీల బిక్షపతి, దాసరి మనోహర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల కోసం పోరాటం చేస్తున్న సిపిఐకి విరాళాలు అందించండి: పల్లె శేఖర్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News