Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం
26-03-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు – సేవలను కొనియాడిన నాయకులు

పేద ప్రజల ఆశాజ్యోతి, స్వాతంత్ర సమరయోధుడు, నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యుడు కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 15వ వర్ధంతిని గురువారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడుపల్లి రోడ్‌లో ఉన్న ఆయన విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు, కార్యకర్తలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ధర్మభిక్షం పేదల కోసం నిరంతరం పోరాడిన మహానేత అని కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు సార్లు ఎంపీగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు.“దున్నేవానికి భూమి కావాలి, గీసేవానికి చెట్టు కావాలి” అనే నినాదాలతో పేదల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని గుర్తుచేశారు. ముఖ్యంగా రాచకొండ గుట్టల్లో ఏర్పాటు చేయదలచిన ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించి దాన్ని రద్దు చేయించిన ఘనత ధర్మభిక్షం దేనని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడుత రామలింగం, గీత పనివాళ్ల సంఘం నాయకులు నీళ్ల బిక్షపతి, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, రొండీ నరసింహ, బద్దుల సుధాకర్, రోషనగారి అంజయ్య, దాసరి మనోహర్, కట్టెల లింగస్వామి, దాసరి కృష్ణ, యాదయ్య, నీళ్ల సంతోష తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల ఆశాజ్యోతి ధర్మభిక్షం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News