Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం
24-03-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత ఆరోగ్య మేళా ప్రారంభం – చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి)లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య మేళాను ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని విభాగాలను పరిశీలించిన చైర్‌పర్సన్, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న ఆరోగ్య మేళాలు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.మేళాలో భాగంగా బీపీ, షుగర్ వంటి పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు కోయడ శేఖర్, బుడ్డ సురేష్, నాయకులు కేతరాజు అచ్చయ్య, ఆలే చిరంజీవి, మండల స్థాయి అధికారులు, వైద్యులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

పేదల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News